వెనెజువెలాపై యుద్ధ మేఘాలు
ప్రపంచ దేశాల బలహీనతలను ఆసరా చేసుకుని వాటిని పాదాక్రాంతం చేయడం, అక్కడ ఉన్న సహజ వనరులను కొల్లగొట్టడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుత అజెండాగా మారింది. గత కొన్నాళ్లుగా జరుగుతున్న సంఘటనలను పరిశీలిస్తే నియంతగా ట్రంప్ దురాక్రమణ చర్యలకు పాల్పడుతున్నారని స్పష్టమవుతోంది. పనామా కాలువ, గ్రీన్‌ల్యాండ్, ఉక్రెయిన్ తమకు దాసోహం అయ్యేలా ట్రంప్ ఎత్తుగడలు ఫలింపచేసుకున్నారు. ఆయా దేశాల్లో ఉండే, రేర్ మినరల్స్ (అరుదైన ఖనిజాలు), చమురు, గ్యాస్ నిక్షేపాలను కొల్లగొట్టే ప్రణాళికలను రూపొందించుకున్నారు. ఇప్పుడు తాజాగా […]