అంతా నివ్వెరపోయేలా భారత్ ఆర్థిక వృద్ధి: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్
ఇండోర్: అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ భారతదేశం ప్రగతిపథంలో దూసుకువెళ్లుతోందని ఆర్‌ఎస్‌ఎస్ సంచాలకులు మోహన్ భగవత్ చెప్పారు. భారత్ పట్ల చిన్నచూపు ఆలోచనలు పనికిరావని రుజువు అయిందన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పుస్తకం పరిక్రమ కృపాసారం ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. విశ్వాసం, సాంప్రదాయక సిద్ధాంతాల విజ్ఞానం మార్గదర్శకాలతో సాగడం వల్లనే భారతదేశ ఆర్థిక పురోగమనం సాధ్యం అయిందని తెలిపారు. కార్యాచరణ, అంకితభావం పురాతన విజ్ఞాన ప్రాతిపదికలు మనకు గెలుపు సాధ్యం చేశాయని […]