ఇటుకల లోడుతో ట్రాక్టర్ అదుపు తప్పి వ్యక్తి మృతి
రంగారెడ్డి జిల్లా: తలకొండపల్లి మండలం మాదాయపల్లిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. సిమెంట్ ఇటుక బట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ సోలార్ సమీపంలో బోల్తా పడిందని స్థానిక నివేదికలు తెలుపుతున్నాయి. Also Read : హైదరాబాద్ విలవిల