అధికారంలోకి రాగానే..అధికారికంగా విమోచనం

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో అధికారంలోకి రాగానే హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని బిజెపి చీఫ్ ఎన్.రాంచందర్‌రావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపా రు. కేంద్ర సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. నిజాం నిరంకుశ వైఖరిని ఎదిరిస్తూ ప్రజలు చేసిన పోరాటాలు, రజాకార్ల హింసాకాండ గురించి కళ్ళకు అ ద్దినట్లు ఉన్న పలు ఫొటోలను ప్రదర్శించారు. వీటి గురిం […]

యుపిఎస్‌సి తరహాలో పరీక్షలు నిర్వహించండి: రాంచందర్ రావు

యుపిఎస్‌సి తరహాలో రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టిజిపిఎస్‌సి) కూడా జాబ్ క్యాలెండర్ రూపొందించి ప్రతి ఏడాది పరీక్షలు నిర్వహించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు ఆమరణ నిరాహార దీక్షకు దిగక ముందే నోటిఫికేషన్ల విషయంలో స్పష్టత ఇవ్వాలని ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. గ్రూపు 1, గ్రూపు 2 పరీక్షలు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వేలాది మంది […]

కేబుల్ ఆపరేటర్లకు ప్రత్యామ్నాయం చూపండి:రాంచందర్ రావు

కేబుల్ ఆపరేటర్లకు ప్రత్యామ్నాయం చూపించండి అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. కేబుల్ వైర్లను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహారిస్తున్నదని ఆయన విమర్శించారు. శుక్రవారం అనేక మంది కేబుల్ ఆపరేటర్లు తార్నాకలోని రాంచందర్ రావు నివాసానికి వెళ్ళి ఎదుర్కొంటున్న సమస్యను వివరిస్తూ వినతి పత్రం అందజేశారు. అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించకుండా కేబుల్ వైర్లను తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. […]