వలసదారులకు నో ఎంట్రీ

అభివృద్ధి చెందిన, అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థలు నెలకొని ఉన్న కొన్ని దేశాలు ప్రస్తుతం అలజడులకు లోనవుతున్నాయి. అక్రమంగానో, సక్రమంగానో తమ దేశాల్లోకి ప్రవేశించి, తిష్ఠవేసుకుని కూర్చున్న వలసదారులవల్ల తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అడుగంటడమే కాకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తుతోందని, తమ జాతీయ, సాంస్కృతిక విలువలు తరిగిపోతున్నాయని ఆయా దేశస్థులు సాగిస్తున్న ఆందోళనలు అర్థం చేసుకోదగినవే. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా వ్యవహరించే అమెరికాలో స్వయంగా అధ్యక్షుడే వలసలకు వ్యతిరేకంగా ఉక్కుపాదం మోపుతున్నారు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ […]

కొడంగల్‌లో అంగన్‌వాడీల మెరుపు ధర్నా

ప్రీప్రైమరీ వ్యవస్థతో అంగన్‌వాడీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతుందని, ప్రీప్రైమరీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు వికారాబాద్ జిల్లా, కొడంగల్‌లో కదం తొక్కారు. కొడంగల్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి ముందు భారీ ఎత్తున అంగన్‌వాడీ కార్యకర్తలు గుమికూడి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సిఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో ధర్నా నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఒక దశలో పోలీసులపై […]