బిజెపిది నకిలీ జాతీయవాదం: కెటిఆర్

వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను బిఆర్‌ఎస్ స్వాగతించడాన్ని విమర్శిస్తున్న బిజెపి నేతలకు భారత రాజ్యాంగం, సుప్రీం కోర్టు మీద ఏమాత్రం గౌరవం లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. బిజెపిది నకిలీ జాతీయవాదమని, తమది మాత్రం ఆచరణలో, ఆత్మలో నిజమైన జాతీయవాదమని స్పష్టం చేశారు. కులం, మతం, వర్గం చూడకుండా ప్రతి భారతీయుడినీ సమానంగా ఆదరించడమే తమ దృష్టిలో నిజమైన జాతీయవాదం అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయవాదానికి, దురహంకార దేశభక్తికి (జింగోయిజం) […]

మోడీ పర్యటనతో మణిపూర్ గాయం మానేనా?

Modi visited Manipur

ఒకప్పుడు భారతదేశ ఈశాన్య సరిహద్దుల్లో జాతు గుర్తింపుల శక్తివంతమైన సముదాయంగాఉన్న మణిపూర్, ఇప్పుడు శాశ్వత విభజనకు చిహ్నంగా మారింది. 2023 మే 3న లోయలో నివసించే మెయితీ మెజారిటీ కమ్యూనిటీ, కొండ ఆధారిత కుకి-జో తెగల మధ్య జాతిపరమైన హింస చెలరేగినప్పటి నుంచీ రాష్ట్రంలో 258 మందికి పైగా మరణించారు. 60,000 మంది నిరాశ్రయులయ్యారు. జాతిపరంగా, అనధికారికంగా స్పష్టమైన విభజనను చూసింది. రెండున్నర సంవత్సరాల తర్వాత, అంటే.. ఘర్షణలు ప్రారంభమైన 865 రోజుల తర్వాత, 2025 సెప్టెంబర్ […]

26 మంది ప్రాణాలకంటే డబ్బే ఎక్కువైందా..? :అసదుద్దీన్ ఒవైసీ

పహల్గాం దాడి తర్వాత పాక్‌తో క్రికెట్ మ్యాచ్ ఎలా ఆడుతారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. మతాన్ని అడిగి మరీ 26 మందిని దారుణంగా కాల్చి చంపారని ఆయన గుర్తు చేశారు. ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్, భారత్ క్రికెట్ మ్యాచ్‌పై తీవ్రంగా స్పందించారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని చెప్పిన మోడీ మాటలను ఆయన గుర్తు చేశారు. క్రికెట్ మ్యాచ్ ఎలా జరుగుతుందో చెప్పాలని అసదుద్దీన్ ప్రధాని మోడీని నిలదీశారు. పహల్గామ్ […]

మోడీ పాలనలో భారత్ ‘ఒంటరి’

నరేంద్ర మోడీ 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత విదేశాంగ విధానాన్ని ఒక కొత్త దిశలో నడిపించాలని ప్రకటించారు. ‘నెయిబర్ హుడ్ ఫస్ట్’ నుంచి ‘ఆక్ట్ ఈస్ట్’ వరకు విశ్వగురుగా భారతదేశాన్ని చూపించాలని ఆయన ఆకాంక్ష. కానీ, గత 11 సంవత్సరాలలో ఈ విధానం ఎన్నో లోపాలను, వైఫల్యాలను చవిచూసింది. నిపుణులు, రాజకీయ విశ్లేషకులు ఈ విధానాన్ని విమర్శిస్తూ, అది దేశ భద్రతకు, అంతర్జాతీయ సంబంధాలకు హాని కలిగించిందని చెబుతున్నారు. ముఖ్యంగా, పొరుగు దేశాలతో సంబంధాలు, […]

మణిపూర్‌లో ఇక శాంతి, సౌభాగ్యాలు

చురాచంద్‌పూర్: మణిపూర్‌ను పేరుకు తగ్గట్లుగానే శాంతి, సౌభాగ్యాలకు ప్రతీకగా నిలపాలనేదే తమ ఆలోచన అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 2023 మే నెలలో తెగల మధ్య సంకుల సమరంతో అతలాకుతలం అయిన ఈ అత్యంత కీలకమైన ఈశాన్య రాష్ట్రంలో ప్రధాని మోడీ ఇక్కడ పర్యటించడం రెండేళ్లలో ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆయన కుకీ తెగలు ఎక్కువగా ఉండే చురాచంద్‌పూర్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఘర్షణలతో తల్లడిల్లిన ఈ నేల సుభిక్షం అయ్యే […]

మిజోరంలో తొలి రైల్వే లైన్.. ప్రారంభించిన మోడీ

ఐజ్వాల్: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మిజోరంలో తొలి రైల్వే లైన్లను ఇతర ప్రాజెక్టులను ఆరంభించారు. ఈ పనుల విలువ రూ 9000 కోట్ల వరకూ ఉంటుంది. ఇతర ప్రాజెక్టులకు కూడా ఆయన ప్రారంభోత్సవం జరిపారు. దేశంలోని ఇతర రైల్వేలైన్ మార్గాలతో ఈ ఈశాన్య ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అనుసంధానం చేసేందుకు ఈ పనులు కీలకం అయ్యాయి. బైరాబి సారంగ్ రైల్వే లైన్ పనులు కూడా ప్రధాని ఆరంభించిన వాటిలో ఉన్నాయి. దేశ ప్రధాని అయిన తరువాత […]

మణిపూర్ శాంతి సౌభాగ్యాలతో విలసిల్లేలా చేస్తాం: ప్రధాని మోడీ

చురాచంద్‌పూర్ : మణిపూర్‌ను పేరుకు తగ్గట్లుగానే శాంతి, సౌభాగ్యాలకు ప్రతీకగా నిలపాలనేదే తమ ఆలోచన అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 2023 మే నెలలో తెగల మధ్య సంకుల సమరంతో అతలాకుతలం అయిన ఈ అత్యంత కీలకమైన ఈశాన్య రాష్ట్రంలో ప్రధాని మోడీ ఇక్కడ పర్యటించడం రెండేళ్లలో ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆయన కుకీ తెగలు ఎక్కువగా ఉండే చురాచంద్‌పూర్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఘర్షణలతో తల్లడిల్లిన ఈ నేల సుభిక్షం […]

మన ప్రధానుల సంప్రదాయం ఇది కాదు.. మోడీపై విమర్శలు

వయనాడ్: జాతుల మధ్య ఘర్షణ జరిగిన రెండేళ్ల తర్వాత ప్రధాని మోడీ మణిపూర్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వయనాడ్‌లో విలేకరులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లో ఘర్షణలు జరిగిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ అక్కడ పర్యటనకు వెళ్లడం దురదృష్టకరమన్నారు. భారత్‌లో ప్రధాన మంత్రుల సంప్రదాయం ఇది కాదంటూ విమర్శించారు. ప్రమాదాలు, విషాదాలు జరిగినప్పుడు ప్రధానులు వెంటనే అక్కడికి వెళ్తార్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి […]

ఉత్తరాఖండ్‌కు ప్రధాని మోడీ రూ.1200 కోట్ల సాయం

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో వరద బాధిత ప్రాంతాలకు విపత్తు సాయంగా రూ. 1200 కోట్లు ప్రధాని మోడీ గురువారం ప్రకటించారు. వైపరీత్యాల వల్ల మృతులైన వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50 వేలు వంతున ప్రకటించారు. అనాథలైన పిల్లలకు పిఎం కేర్స్ పథకం కింద సాయం చేస్తామన్నారు. బాధిత కుటుంబాలను కలుసుకుని పరామర్శించారు. విపత్తులో క్షేత్రస్థాయిలో బాధితులకు సహాయం అందించిన ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, సిబ్బందిని, వాలంటీర్లను అభినందించారు. బాధితుల పునరావాసానికి కేంద్ర […]

మోహన్ భగవత్‌కు 75 ఏండ్లు.. ప్రత్యేక వ్యాసంతో మోడీ విషెస్

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన సంచాలకులు మోహన్ భగవత్ గురువారంతో తమ 75వ సంవత్సరంలోకి ప్రవేశించారు. అత్యంత ప్రధానమైన ఈ హిందూత్వ సంస్థ సారధ్య బాధ్యతల్లో ఉన్న భగవత్‌కు ప్రధాని నరేంద్ర మోడీ , అధికార ఎన్‌డిఎ భాగస్వామ్యపక్షాల నేతలు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. సర్‌సంఘ్‌చాలక్‌గా ఆర్‌ఎస్‌ఎస్ సారధ్య బాధ్యతల్లోని వారిని వ్యవహరిస్తారు. ఆయన నాయకత్వ పటిమను ప్రధాని మోడీ ప్రశంసించారు. ప్రత్యేకంగా ఆయన కార్యదక్షతను కొనియాడుతూ ప్రధాని పేరిట వెలువడ్డ వ్యాసం […]