ప్రపంచవేదికపై బ్రాహ్మణుల బతుకు చిత్రం
భారతదేశంలో కుల వ్యవస్థ అనేది సుదీర్ఘమైన చారిత్రక, సామాజిక, ఆర్థిక చర్చలకు కేంద్రంగా ఉంది. ఈ చర్చలు తరచుగా దేశరాజకీయాల పరిధిలోనే కొనసాగుతాయి. కానీ అప్పుడప్పుడు అంతర్జాతీయ వేదికలపైనా వివాదాలను రేకెత్తిస్తాయి. అటువంటి ఒక సందర్భమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరో చేసిన వ్యాఖ్యలు. రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకొని, దానిని శుద్ధిచేసి పశ్చిమదేశాలకు విక్రయించడం ద్వారా భారతదేశం ‘క్రెమ్లిన్‌కు లాండ్రోమాట్’గా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ప్రక్రియలో ‘బ్రాహ్మణులు […]