కీసర పరిధిలో కిడ్నాప్ కలకలం
నగర శివారులోని కీసర పోలీసుస్టేషన్ పరిధిలో యువతి కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఓ జంట తమ కూతురిని కిడ్నాప్ చేసిన ఘటన పెను సంచలనం రేపుతోంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం కీసర పోలీస్ స్టేషన్ పరిధి లోని నర్సంపల్లి గ్రామంలో కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. తల్లిదండ్రులు తమ కన్న కూతురుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఇందుకు కారణం ప్రేమ వివాహమేనని తెలుస్తోంది. నర్సంపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్, ఓ యువతి ప్రేమించుకున్నారు. […]