పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయండి: మంత్రి పొంగులేటి
మంత్రి పొంగులేటి పేదవాడి సొంతింటి కలను నెరవర్చే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, చెల్లింపుల విషయంలో అవినీతికి పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి లంచం డిమాండ్ చేసిన సంగారెడ్డి జిల్లాలోని పంచాయతీ కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి పొంగులేటి ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా మాజిద్‌పూర్ గ్రామ కార్యదర్శిపై లోతైన విచారణ జరపాలని ఆయన […]