ఓజోన్ రక్షతి రక్షితః

ఓజోన్ అనేది ఆక్సిజన్ ప్రత్యేక రూపం. ఇది మూడు ఆక్సిజన్ పరమాణువులతో ఏర్పడిన ప్రత్యేకమైన వాసన కలిగిన రంగులేని వాయువు. భూవాతావరణంలో స్ట్రాటోస్పియర్ పొరలో ఉండే ఓజోన్ వాయువు పొర అతినీల లోహిత కిరణాలను శోషించుకొని భూమిపైగల సమస్త జీవరాశిని కాపాడుతుంది. అందుకే ఓజోన్ పొరను భూమి కవచం లేదా భూమి గొడుగు అంటారు. ఇది నీటిలోని సూక్ష్మక్రిములను చంపడానికి, గాలిని శుభ్రపరచడానికి, ఆహార పదార్థాల రంగును పోగొట్టడానికి, ఆహార నిల్వలలో బ్యాక్టీరియా పెరుగకుండా కూడా ఉపయోగపడుతుంది. […]