రూమ్ కు పిలిచి… యువతిని చంపిన ప్రేమోన్మాది

Nellore Andhra Pradesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరులో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రియురాలిని రూమ్ కు పిలిచుకొని ప్రియుడు హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నిఖిల్ అనే యువకుడు ప్రేమించిన యువతి మైథిలిని కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. హత్య చేసిన తర్వాత మృతురాలి చెల్లెలు సాహితికి ఫోన్ చేసి గొడవ జరగడంతోనే చంపేశానని తెలిపాడు. దర్గామిట్ట పోలీస్ స్టేషన్ లో నిందితుడు నిఖిల్ లొంగిపోయాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. […]

నెల్లూరులో రిక్షాలో తరలించిన మృతదేహం

dead body on rickshaw

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కలిగిరిలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌ యాజమన్యం మానవత్వం మరిచింది. అంబులెన్స్‌ రాకముందే మృతదేహాన్ని రిక్షాలో ప్రభుత్వాస్పత్రికి తరలించింది. ఈ వీడియో చిత్రీకరించిన మీడియాపై ఆస్పత్రి దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బందిపై నెటిజన్లు మండిపడుతున్నారు. విలువల కంటే ఆస్పత్రులు డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని దుయ్యబట్టారు.