చిట్టి తల్లీ నిశ్చింతగా చదువుకో.. కెజిబివిలో సీటు ఇప్పించే బాధ్యత నాది: లోకేష్
అమరావతి: కెజిబివిలో సీటు రాలేదని పత్తి పొలాల్లో కూలీగా వెళుతున్న జెస్సీ కథనం తనని కదిలించిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. చదువుకోవాలనే జెస్సీ ఆశను వెలుగులోకి తీసుకొచ్చిన మీడియాకు అభినందనలు తెలిపారు. నారా లోకేష్ తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించారు. విద్యాశాఖ అధికారులతో మాట్లాడానని, చిట్టి తల్లీ! కెజిబివిలో సీటు వస్తుందని స్పష్టం చేశారు. నిశ్చింతగా చదువుకో! పరిస్థితులు ఏమైనా కానీ పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చేతులు పత్తి చేలో మగ్గిపోవడం బాధాకరమన్నారు. తల్లిదండ్రులు […]