సాగర్‌కు భారీగా వరద ప్రవాహం.. 26 క్రస్ట్ గేట్లు ఓపెన్
మన తెలంగాణ/నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ డ్యామ్ జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తుండటంతో జలాశయానికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ఎగువ శ్రీశైలం జలాశయం 7 క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,93,634 క్యూసెక్కుల నీటిని, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 66,280 క్యూసెక్కుల నీటిని మొత్తం 2,81,352 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న సాగర్ రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు. శనివారం […]