టేకాఫ్ సమయంలో ఊడిన విమానం టైర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ముంబై: స్పైస్‌జెట్ (Spicejet) సంస్థకు చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది. గుజరాత్‌లోని కండ్లా నుంచి ముంబైకి వెళ్తున్న క్యూ400 స్పైస్‌జెట్ విమానం టేకాఫ్ అయిన సమయంలో టైర్ ఒకటి ఊడిపోయింది. అయితే అప్పటికీ ప్రయాణం కొనసాగించి ముంబై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. విమాన ప్రమాదానికి గురైన సమయంలో అందులో 75 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన […]