ప్రజలు మిమ్ముల్ని విశ్వసించరు: అద్దంకి దయాకర్

రాష్ట్ర ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీని నమ్మే పరిస్థితులు లేవని, గద్వాలలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ఎంత గొంతు చించుకున్నా, బట్టలు విప్పుకున్నా ఫలితం ఉండదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. వంద ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్రకు పోయినట్లు కెటిఆర్ తీరు ఉందని విమర్శించారు. బిఆర్‌ఎస్ పార్టీ పదేండ్ల పాలనలో 39 మంది ఎమ్మెల్యేలను బిఆర్‌ఎస్ లో చేర్చుకున్న విషయాన్ని అద్దంకి దయాకర్ గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి మోగోడు అయితే పార్టీ […]

రాబోయే సింగరేణి ఎన్నికల్లో హెచ్‌ఎంఎస్ జెండా ఎగురబోతోంది

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సింగరేణిలో జరుగుతోన్న అవినీతికి వ్యతిరేకంగా హెచ్‌ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో శుక్రవారం హెచ్‌ఎంఎస్- సింగరేణి జాగృతి సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కవితను హెచ్‌ఎంఎస్, సింగరేణి జాగృతి నాయకులు ఘనంగా సత్కరించారు. ఇటీవల హెచ్‌ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కల్వకుంట్ల […]

కవితతో చింతమడక వాసుల భేటీ

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో ఆమె తండ్రి కెసిఆర్ సొంత ఊరు చింతమడక గ్రామస్తుల భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన చింతమడక గ్రామస్తులు ఈనెల 21న ఎంగిలి పూల బతుకమ్మ పండుగకు రావాలని ఆహ్వానించారు. కవిత స్పందిస్తూ..గొప్ప ఉద్యమకారుడిని కన్న గొప్ప ఊరు మా చింతమడక అని పేర్కొన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి తనను బతుకమ్మకు ఆహ్వానించడం సంతోషంగా ఉందని అన్నారు. తాను చింతమడక నుంచి ఎంతో నేర్చుకున్నానని, […]