గాజులరామారంలో భూకబ్జా చేసింది ఎంఎల్ఎ వివేకానందనే: కూన శ్రీశైలం గౌడ్
హైదరాబాద్: గత ప్రభుత్వంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామని కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు. స్థానిక ఎమ్మల్యే, ఎమ్మెల్సీల సహకారంతో పదేళ్లుగా విచ్చలవిడిగా ఆక్రమణలు జరిగాయని మండిపడ్డారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న స్థలం వద్దకు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ చేరుకొని ప్రరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మీడియాతో మాట్లాడారు. కుత్బుల్లాపూర్ లో వందల ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జా కావడానికి ప్రధాన సూత్రధారి […]