త్వరలో కిషోర బాలికా సంఘాలు : మంత్రి సీతక్క

మహిళా స్వయం సహాయక బృందాల తరహాలోనే కౌమార బాలిక సంఘాలను ఏర్పాటు చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క ప్రకటించారు. కౌమార బాలిక సంఘాల ఏర్పాటు పై అధికారులకు మంత్రి సీతక్క దిశ నిర్దేషం చేశారు. కౌమార బాలిక సంఘాల ఏర్పాటుతో ఎన్నో సామాజిక రుగ్మతలను రూపుమాపవచ్చని మంత్రి పేర్కొన్నారు. బేగంపేటలోని జ్యోతి రావు పూలే ప్రజా భవన్‌లో కౌమార బాలికల భద్రత, ఆరోగ్యం, పోషణ, […]

ఈ నెల 17 నుంచి పోషణ మాసం ప్రారంభం

ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోషణ మాస మహోత్సవాన్ని నిర్వహించనున్నట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. చిన్నారులు, మహిళల ఆరోగ్యం, పోషకాహారాన్ని మెరుగుపర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మహోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తోంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా అంగన్వాడీ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికీ పోషణ సందేశం చేరవేసేలా ప్రభుత్వం కార్యచరణ సిద్దం చేసింది. పోషణ మాసం మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులంతా […]

మహిళలు, చిన్నారుల భద్రతకు త్వరలో నూతన విధానం:మంత్రి సీతక్క

ఈ నెల 22న మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ఉన్నతాధికారులతో మహిళా సదస్సు నిర్వహించి వారి అభిప్రాయాల ఆధారంగా కొత్త మహిళా భద్రతా విధానాన్ని తీసుకురాబోతున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. ముఖ్యంగా చిన్నారుల రక్షణను తమ ప్రభుత్వం ప్రధాన బాధ్యతగా భావిస్తోందని స్పష్టం చేశారు. పిల్లలు అంటే మన భవిష్యత్తు అని, వారి రక్షణ అంటే మన భవిష్యత్తు రక్షణగా మంత్రి పేర్కొన్నారు. నగరంలోని ఒక హోటల్ ప్రాంగణంలో సిఐఐ, యంగ్ ఇండియన్స్ […]