అర్థం కానిది

వలసలు అనివార్యమైన ప్రతిసారీ ఇదే ప్రశ్న ‘ఎందుకిది?’ అని బతకడం కోసమా, సుఖాన్వేషణల కోసమా, అందరినీ చించుకునే ‘స్కిప్’ కోసమా ప్చ్.. తెలియదు వెళ్ళిపోవాలె.. తెంచుకుని, కోసేసుకుని, కత్తిరించుకుని వెళ్ళిపోవాలె కానీ.. ఎక్కడికి?.. తెలియదు.. కానీ వెళ్ళిపోవాలె యూనివర్సిటీలు.. సర్టిఫికెట్లు పాస్‌పోర్టులు.. వీసాలు.. ‘పోర్ట్‌ఔట్’లు వీటిని విడిచిపెడ్తున్నావూ అంటే.. వాడికి చేరువవుతున్నావూ అని అర్థం ‘గివ్‌అండ్టేక్పాలసీ’ ఒకటి, ‘యూస్‌అండ్త్రో’ మరొకటి ‘యూస్‌అండ్ప్రిజర్వ్’ రహస్యం తెలుసుకోవాలె మెడలో ‘సోల్’ ట్యాగ్ గురించీ, జేబులో ఐఐటి గోల్డ్ మెడల్ కాసుబిళ్ళ […]