జన జీవన స్రవంతిలోకి కేంద్ర కమిటీ సభ్యురాలు

సిపిఐ మావోయిస్టు పార్టీలో 43 సంవత్సరాలుగా పనిచేసిన కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి అలియాస్ కల్పన, అలియాస్ మైనాబాయి, అలియాస్ మైనక్క, అలియాస్ సుజాత శనివారం రాష్ట్ర డిజిపి జితేందర్ ఎదుట లొంగిపోయింది. 1982లో పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరడంతో ప్రారంభమైన సుజాత మావోయిస్టు ప్రస్థానం 62ఏళ్ల వయస్సులో అనారోగ్య కారణాలతో డిజిపి ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవడంతో ముగిసింది. దీనికి సంబధించిన వివరాలు శనివారం డిజిపి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో డిజిపి […]