కోటి రూపాయల రివార్డున్న మావో కమాండర్ మృతి

రాంచీ: జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో సోమవారం ఉదయం భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో కోటి రూపాయల రివార్డు ఉన్న సహదేవ్ సోరెన్ అనే మావోయిస్టు సహా మొత్తం ముగ్గురు నక్సలైట్లు హతమైనట్లు పోలీసులు తెలిపారు. గోర్‌హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంతిత్రి అడవుల్లో ఉదయం ఆరు గంటల నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సహదేశ్ అలియాస్ ప్రవేశ్ నిషిద్ధ సిపిఐ(మావోయిస్టు) సెంట్రల్ కమిటీ సభ్యుడు. ఆయనపై కోటి రూపాయల […]

పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత భార్య

Maoist leader surrenders

హైదరాబాద్: మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్‌జీ భార్య పోతుల కల్పన అలియాస్ సుజాతక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో సభ్యురాలుగా సేవలందిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇంచార్జీగా పని చేస్తున్నారు. గద్వాల ప్రాంతానికి చెందిన కల్పన ఏకైక మహిళా నాయకురాలుగా పని చేస్తున్నట్టు సమాచారం. కల్పన 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. శనివారం ఆమె లొంగుబాటు గురించి డిజిపి జితేందర్ వివరాలు వెల్లడిస్తారు. ఆమెతో పాటు మరికొందరు […]

ర‌విత్ర‌యం… జంగు సైర‌నూదిరో జైలులో మాయ‌న్న‌లు

Modem Balakrishna

తెలుగు నేలనంతా హోరెత్తించిన “జంగు సైర‌నూదిరో జైలులో మాయ‌న్న‌లు” పాట‌కు స్ఫూర్తినిచ్చిన పోరాటానికి నాయ‌క‌త్వం వ‌హించింది ముగ్గురు విప్ల‌వ కారులు. 90వ ద‌శ‌కంలో అరెస్ట‌యి హైద‌రాబాద్ జైల్లో ఉన్న అప్ప‌టి పీపుల్స్ వార్ నాయ‌కులు చారిత్రాత్మ‌క పోరాటాన్ని నిర్మించారు. “ర‌విత్ర‌యం” (శాఖ‌మూరి అప్పారావు అలియాస్ ర‌వి, ప‌టేల్ సుధాక‌ర్ రెడ్డి అలియాస్ సూర్యం, మోడెం బాల‌కృష్ణ అలియాస్ భాస్క‌ర్) శ‌తృ శిబిరాన్ని కూడా పోరాట కేంద్రంగా ఎలా మ‌ల‌చ‌వ‌చ్చో ఆచ‌ర‌ణ‌లో చూపించారు. త‌మ పోరాటం వ‌ల్ల దేశ […]