కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే సర్కార్ సంకల్పం: పిసిసి చీఫ్
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బుధవారం ప్రకాశం హాలులో జరిగిన మహిళా సాధికారత సమావేశానికి మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ పరంగా బిసి, ఎస్‌సి, ఎస్‌టి కార్పోరేషన్ల నుంచి కుట్టు మిషన్ల […]