వలసదారులకు నో ఎంట్రీ
అభివృద్ధి చెందిన, అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థలు నెలకొని ఉన్న కొన్ని దేశాలు ప్రస్తుతం అలజడులకు లోనవుతున్నాయి. అక్రమంగానో, సక్రమంగానో తమ దేశాల్లోకి ప్రవేశించి, తిష్ఠవేసుకుని కూర్చున్న వలసదారులవల్ల తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అడుగంటడమే కాకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తుతోందని, తమ జాతీయ, సాంస్కృతిక విలువలు తరిగిపోతున్నాయని ఆయా దేశస్థులు సాగిస్తున్న ఆందోళనలు అర్థం చేసుకోదగినవే. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా వ్యవహరించే అమెరికాలో స్వయంగా అధ్యక్షుడే వలసలకు వ్యతిరేకంగా ఉక్కుపాదం మోపుతున్నారు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ […]