డైవర్షన్ పాలిటిక్స్ మానండి:హరీశ్‌రావు

దేశ చరిత్రలో యూరియా కోసం రైతులు ఇంతగా తిప్పలు పడ్డ పరిస్థితులు ముందెన్నడూ లేదని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలన వల్ల పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు యూరియా కోసం నడిరోడ్ల వెంట బారులు తీరుతున్నారని, ఆధార్ కార్డు, పాస్ బుక్కులు చేత పట్టుకొని యూరియా బస్తా కోసం పడిగాపులు కాస్తున్నరని, పండుగ లేదు..పబ్బం లేదు..వాన లేదు..ఎండ లేదు, రాత్రి లేదు, పగలు లేదు క్యూలో […]

రష్యా డ్రోన్లను కూల్చివేసిన నాటో దేశం

వార్సా : ఎలాంటి అనుమతి లేకుండా పోలండ్ గగనతలం లోకి ప్రవేశించిన రష్యా డ్రోన్లను పోలండ్ ముందు జాగ్రత్తగా కూల్చి వేసింది. నాటో సభ్య దేశం లోకి డ్రోన్లు ప్రవేశించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ గగనతలం లోకి డ్రోన్లు ప్రవేశించడంపై నాటో సెక్రటరీ జనరల్‌కు సమాచారం ఇచ్చామని పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ చెప్పారు. ఈ సందర్భంగా టస్క్ ఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టు ఆయన కార్యాలయం పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని […]

ఆసియా కప్ 2025: 4.3 ఓవర్లలోనే భారత్ విజయం

దుబాయ్: ఆసియా కప్ 2025లో భాగంగా జరిగిన రెండవ మ్యాచ్‌లో యుఎఇపై టీమిండియా ఘన విజయం సాధించింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేవలం 4.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి మ్యాచ్ ను ముగించేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(30), శుభ్ మన్ గిల్(20 నాటౌట్)లు రాణించారు. దీంతో ఆసియా కప్ లో భారత్ బోణి కొట్టింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ […]

ఓటు చోరీ నినాదంతో ప్రజల్లోకి.. రాహుల్ గాంధీ వెల్లడి

రాయ్‌బరేలీ: దేశ ప్రజల ముందుకు కాంగ్రెస్ పార్టీ.. ఓటు చోర్, గద్ది చోడ్ నినాదంతో మరింత బలంగా వెళ్లుతుందని పార్టీ నేత రాహుల్ గాంధీ తెలిపారు. ప్రజల నిజమైన ప్రజాస్వామిక ఓటు హక్కు చోరీ అయిందని, దేశవ్యాప్తంగా ఇది జరిగిందని చెప్పారు. ఇదే విషయాన్ని తమ పార్టీ రాబోయే రోజులలో మరింత ఆశ్చర్యకర నాటకీయ ఉదాహరణలతో ప్రజల ముందుంచుతుందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని తమ సొంత పార్లమెంటరీ నియోజకవర్గం రాయ్‌బరేలీలో రెండు రోజుల పర్యటనకు రాహుల్ బుధవారం వచ్చారు. […]

సాదా బైనామాల నోటిఫికేషన్ విడుదల

సాదా బైనామాలపై ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ జీఓ నెంబర్ 106 పేరుతో బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాదా బైనామా క్రమబద్ధీకరణ కోసం 9.89 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 11లక్షల ఎకరాలకు 13 బీ ప్రొసీడింగ్స్ జారీ అయ్యే అవకాశం ఉంది.

జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ?

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలకు బీఆర్‌ఎస్ అభ్యర్థిగా దివంగత సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య సునీతను ఆ పార్టీ ఖరారు చేసింది. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ అధికారికంగా ప్రకటించనప్పటికీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరోక్షంగా వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, మాగంటి గోపినాథ్ కుటుంబానికి పార్టీ కార్యకర్తలు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. మాగంటి సునీతను వే దికపైకి ఆహ్వానించి కార్యకర్తలకు కేటీఆర్ […]

భారత్-అమెరికా వాణిజ్య చర్చలకు సిద్ధం.. ట్రంప్ ట్వీటుకు మోడీ ఓకె

న్యూఢిల్లీ : భారత్-అమెరికా సహజ భాగస్వామ్యపక్షాలు. ఈ చిరకాల, నిజమైన బంధం ప్రాతిపదికననే ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం సాకారం అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ప్రధాని మోడీ ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా వెలువరించిన స్పందన ఇరుదేశాల ఇప్పటి అనిశ్చితత నడుమ అత్యంత కీలకం అయ్యాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులు పరిష్కారించుకునేందుకు అన్ని విదాలుగా దౌత్యచర్చలు జరుగుతున్నాయని ట్రంప్ వెలువరించిన వ్యాఖ్యలకు స్పందనగా మోడీ ట్రేడ్ డీల్ […]

మీసేవ ద్వారా సులభంగా కుల ధ్రువీకరణ పత్రాలు

రాష్ట్రంలో కుల ధ్రువీకరణ పత్రాల జారీని మరింత వేగవంతం చేస్తూ, ప్రజలకు సులభతరం చేస్తామని ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. మీసేవ ద్వారా ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన 15 రోజుల్లోనే 17,500 మందికి పైగా లబ్ధి చేకూరిందని, ప్రతి సంవత్సరం దాదాపు 20 లక్షల మంది ఈ మార్పులతో ప్రయోజనం పొందనున్నారని ఆయన తెలిపారు. కొత్త విధానంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు కుల ధ్రువీకరణ […]

బీహార్‌లో నాలుగు లేన్ల మోకామా రోడ్డుకు కేంద్రం ఒకే

న్యూఢిల్లీ : బీహార్‌లో నాలుగు లేన్ల మోకామా ముంగేర్ రోడ్ నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని వెలువరించింది. బక్సర్ భగల్పూరు హై స్పీడ్ కారిడార్ పనులలో భాగమైన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ 4,447.38 కోట్ల వ్యయం అవుతుందని అంచనావేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ 4 లేన్ రోడ్డు నిర్మాణానికి అనుమతిని ఇచ్చారు. ఈ ఏడాది చివరిలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. […]

త్రిబుల్ ఆర్ రోడ్డు వద్దు మా భూములు మాకే కావాలి

త్రిబుల్‌ ఆర్ రోడ్డు వద్దు…మా భూమలు మాకు కావాలి’ అని అంటూ నల్లగొండ జిల్లా, చౌట్టుప్పల్ మండల రైతులు సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బండ శ్రీశైలం నాయకత్వంలో వారు తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్రిబుల్ ఆర్ రోడ్డు వల్ల రైతులు భూమలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు వేస్తే భూమికి భూమి ఇవ్వాలని, ఓపెన్ వాల్యూవేషన్‌పై నాలుగు […]