ఉత్తరాఖండ్‌కు ప్రధాని మోడీ రూ.1200 కోట్ల సాయం

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో వరద బాధిత ప్రాంతాలకు విపత్తు సాయంగా రూ. 1200 కోట్లు ప్రధాని మోడీ గురువారం ప్రకటించారు. వైపరీత్యాల వల్ల మృతులైన వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50 వేలు వంతున ప్రకటించారు. అనాథలైన పిల్లలకు పిఎం కేర్స్ పథకం కింద సాయం చేస్తామన్నారు. బాధిత కుటుంబాలను కలుసుకుని పరామర్శించారు. విపత్తులో క్షేత్రస్థాయిలో బాధితులకు సహాయం అందించిన ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, సిబ్బందిని, వాలంటీర్లను అభినందించారు. బాధితుల పునరావాసానికి కేంద్ర […]

మణిపూర్‌లో 40 మంది బిజెపి సభ్యుల మూకుమ్మడి రాజీనామా

BJP Presidents

ఇంఫాల్ : మణిపూర్‌లో త్వరలో ప్రధాని మోడీ పర్యటించనున్న సమయంలో ఫుంగ్యార్ నియోజకవర్గానికి చెందిన 40 మంది బీజేపీ సభ్యులు గురువారం మూకుమ్మడి రాజీనామా చేశారు. నాగా మెజారిటీ జిల్లా ఫుంగ్యార్ మండలానికి చెందిన మండల అధ్యక్షుడు, మహిళా, యువ, కిసాన్ మోర్చాలకు చెందిన సభ్యులే కాకుండా నియోజకవర్గం లోని బూత్ స్థాయి అధ్యక్షులు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. అయితే ఈ రాజీనామాలపై రాష్ట్ర బిజేపి ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. పార్టీలోని ప్రస్తుత రాష్ట్ర వ్యవహారాలకు […]

హాంకాంగ్ ఓపెన్ 2025.. క్వార్టర్ ఫైనల్‌కు ఆయుష్, లక్షసేన్

హాంకాంగ్: ప్రతిష్ఠాత్మకమైన హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు ఆయుష్ శెట్టి, లక్షసేన్‌లు పురుషుల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట ప్రిక్వార్టర్ ఫైనల్లో జయభేరి మోగించి ముందంజ వేసింది. గురువారం జరిగిన సింగిల్స్ పోరులో ఆయుష్ 2119, 1221, 2114తో ప్రపంచ 9వ ర్యాంక్ ఆటగాడు నరకొరా (జపాన్)పై సంచలన విజయం సాధించాడు. లక్షసేన్ హోరాహోరీ పోరులో భారత్‌కే చెందిన […]

బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో తెలంగాణ దేశానికి ఆదర్శం:మంత్రి పొంగులేటి

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడుతుందని రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్ది అన్నారు. గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో ఈనెల 15న కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రులు సీతక్క, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, […]

నూతన మున్సిపాలిటీలు, పంచాయతీల ఏర్పాటు బిల్లుకు గవర్నర్ ఆమోదం

Raj Bhavan

తెలంగాణ పంచాయతీ రాజ్ (రెండో సవరణ) చట్టం, 2025 బిల్లును గవర్నర్ ఆమోదించి గురువారం సంతకం చేశారు. ఈ బిల్లులో సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ, నల్గొండ జిల్లాలోని హాలియా మున్సిపాలిటి పరిధిలోని ఇబ్రహీంపేట ను నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఈ బిల్లును శాసనసభ, మండలి ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపడంతో ఇప్పుడు ఆమోదం జరిగింది. ఇందుకు సంబంధించి త్వరలో గెజిట్ నోటిఫికేషన్ విడుదలవుతుందని పంచాయతీరాజ్ శాఖ […]

హాలీవుడ్ స్థాయిలో ‘కిష్కింధపురి’..

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన మిస్టీరియస్ థ్రిల్లర్ ’కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శకులు అనిల్ రావిపూడి, బుచ్చిబాబు సాన, నిర్మాత సుస్మిత కొణిదెల ముఖ్య అతిధులుగా హాజరైన ఈ ప్రీరిలీజ్ వేడుకచాలా గ్రాండ్ గా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ అనిల్ […]

మోహన్ భగవత్‌కు 75 ఏండ్లు.. ప్రత్యేక వ్యాసంతో మోడీ విషెస్

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన సంచాలకులు మోహన్ భగవత్ గురువారంతో తమ 75వ సంవత్సరంలోకి ప్రవేశించారు. అత్యంత ప్రధానమైన ఈ హిందూత్వ సంస్థ సారధ్య బాధ్యతల్లో ఉన్న భగవత్‌కు ప్రధాని నరేంద్ర మోడీ , అధికార ఎన్‌డిఎ భాగస్వామ్యపక్షాల నేతలు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. సర్‌సంఘ్‌చాలక్‌గా ఆర్‌ఎస్‌ఎస్ సారధ్య బాధ్యతల్లోని వారిని వ్యవహరిస్తారు. ఆయన నాయకత్వ పటిమను ప్రధాని మోడీ ప్రశంసించారు. ప్రత్యేకంగా ఆయన కార్యదక్షతను కొనియాడుతూ ప్రధాని పేరిట వెలువడ్డ వ్యాసం […]

నేపాల్ జైలులో 8 మంది ఖైదీల మృతి..15 వేల మంది పరారీ

ఖాట్మండూ: నేపాల్‌లో జెన్‌జెడ్ ఉద్యమకారులు చేపట్టిన ఆందోళనలను ఆసరా చేసుకొని జైళ్ల నుంచి ఖైదీలు పరారవుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం మాదేష్ ప్రావిన్స్‌లో రమేచాప్ జిల్లా జైలు గోడలను గ్యాస్ సిలిండర్‌తో పేల్చి పరారవ్వడానికి ప్రయత్నించిన ఖైదీలను నివారించడానికి భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఖైదీల మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది.13 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని రమేచాప్ జిల్లా ఆస్పత్రికి చికిత్స కోసం […]

క్రికెట్ మ్యాచే కదా.. జరగనివ్వండి: భారత్-పాక్ పోరుపై సుప్రీం

న్యూఢిల్లీ : ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ రద్దుకు దాఖలైన పిటిషన్ తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై అత్యవసరంగా విచారణ తేదీ ఖరారు చేయాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం పిటిషనర్ తరఫు న్యాయవాదికి తెలిపింది. ఎందుకింత తొందర అని ప్రశ్నించారు. న్యాయమూర్తులు జెకె మహేశ్వరి, విజయ్ బిష్ణోవ్‌తో కూడిన ధర్మాసనం ముందు విచారణకు పిటిషన్ వచ్చింది. 2025 ఆపియా కప్ లో భాగంగా ఈ నెల 14వ తేదీన దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ […]

విద్యుత్ స్తంభాలు మీద పడి ఇద్దరు కార్మికుల మృతి

బోధన్ జిల్లా సాలురా మండలం సిద్దాపూర్ గ్రామ శివారులో గురువారం సాయంత్రం విద్యుత్ స్తంభాలు పైన పడి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రూరల్ ఎస్‌ఐ మచ్చేందర్ కథనం ప్రకారం… ఇటీవల వరదల కారణంగా బికినీల్లి గ్రామంలో విద్యుత్ స్తంభాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటి స్థానంలో కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కల్దుర్కి శివారులోని నిల్వచేసిన ప్రాంతం నుంచి విద్యుత్ స్తంభాలను ట్రాక్టర్ల […]