రైళ్లో నుంచి కిందపడి హీరోయిన్‌కు గాయాలు

Karishma sharma injured

ముంబయి: కదులుతున్న లోకల్ రైలు నుంచి దూకడంతో కిందపడి కరిష్మా శర్మ గాయపడ్డారు. దీనికి సంబంధించిన పోస్టును తన ఇన్‌స్టా గ్రామ్‌లో తెలియజేశారు. షూటింగ్ కోసం చీరలో బయలుదేరాను, ముంబయి లోకల్ రైలు ఎక్కగానే అది వేగంగా కదిలింది, అప్పటికీ తన స్నేహితులు రైలు ఎక్కకపోవడంతో తనలో ఆందోళన మొదలైంది, వెంటనే రైలు నుంచి కిందకు దూకింది. ఈ క్రమంలో కిందపడిపోవడంతో తలతో పాటు వీపు భాగంలో గాయాలయ్యాయి. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీపు […]

ఐఎండీ వెదర్ రిపోర్ట్ : బంగాళాఖాతంలో అల్పపీడనం…! ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపటి వరకు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఆయా జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది. 

ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం

CP Radhakrishnan sworn in as Vice President

ఢిల్లీ: ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాధాకృష్ణన్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. సిపి రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. 1957లో అక్టోబర్ 20న తమిళనాడు రాష్ట్రం తిరుప్పూర్‌లో జన్మించారు. 1998, 1999లో కోయంబత్తూరు నుంచి ఎంపిగా గెలిచారు. […]

వెంటాడి మరీ తల నరికి, కాలితో తన్ని.. అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య!

అమెరికాలో దారుణం జరిగింది! కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తిని, అతని కుటుంబం కళ్లముందే హత్యకు గురయ్యాడు. నిందితుడు.. ఆ వ్యక్తి తల నరికి, కాలితో తన్నాడు! ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఏపీ రేషన్ కార్డుదారులకు అలర్ట్ – ఈ పొరపాటు అసలు చేయకండి, లేకపోతే కార్డు రద్దవుతుంది..!

రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతోందని మంత్రి నాదెండ్ల తెలిపారు. కార్డులో ఏమైనా తప్పులు ఉంటే అక్టోబర్ 31లోపు సరి చేసుకోవాలన్నారు. 3 నెలలు వరుసగా రేషన్ తీసుకోకపోతే కార్డు రద్దవుతుందని చెప్పారు. ఆ తర్వాత సచివాలయాలకు వెళ్లి సరైన సమాచారం ఇస్తే ఆ కార్డును యాక్టివేట్ చేసుకోవచ్చని తెలిపారు.

హిజ్రాను పెళ్లి చేసుకున్న యువకుడు… వీడియో వైరల్

Transgender married tamilnadu salem

చెన్నై: ఓ యువకుడు హిజ్రాను పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా తారమంగళం ప్రాంతంలో జరిగింది. ఓమలూరు గ్రామానికి చెందిన శరవణకుమార్ (32) అనే యవకుడు వస్త్ర దుకాణంలో పని చేస్తున్నాడు. అదే దుకాణంలో హిజ్రా సరోవ(30)ను ప్రేమించాడు. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నామని కుటుంబ సభ్యులకు తెలిపారు. పెద్దల సమక్షంలో ఈరోడ్ జిల్లా గోపిచెట్టిపాలయంలో పెరియార్ కల్యాణంలో మండపంలో అంగరంగా వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు కళగం జిల్లా అధ్యక్షుడు […]

ఆర్టిసి బస్సు బోల్తాపడి 10 మందికి గాయాలు

RTC bus over turned

అనంత పురం జిల్లా: బెలుగుప్ప- నక్కపల్లి మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టిసి బస్సు బోల్తాపడి 10 మంది ప్రయాణికులు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి  తరలించారు. ఆర్టిసి బస్సులో 17 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. Also Read : డల్లాస్ లో భారత సంతతి వ్యక్తి తల నరికి హత్య

హైదరాబాద్​ వేదికగా Poultry India Expo 2025- ఆ లక్ష్యంతో ముందడుగు!

హైదరాబాద్​ వేదికగా ఈ నవంబర్​లో పౌల్ట్రీ ఇండియా ఎక్స్​పో 2025 జరగనుంది. పౌల్ట్రీ రైతులకు ఉపయోగపడే అనేక అంశాలపై చర్చించనున్నారు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

యాదాద్రి భువనగిరి జిల్లాలో రాకపోకలకు అంతరాయం

Bhuvanagiri-Chityala road closed

మన తెలంగాణ / మోటకొండూరు: యాదాద్రి భువనగిరి జిల్లా పలు ప్రాంతాలలో రాకపోకలకు అంతరాయం కలిగింది. భువనగిరి – చిట్యాల రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. నాగిరెడ్డిపల్లి వద్ద లోలెవల్ బ్రిడ్జిపై వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతికి వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా ఆలేరు మోటకొండూర్ మధ్య రాకపోకలు బంద్ చేస్తూ బారి కేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. బహుదూర్ పేట వాగు, మంతపురి వద్ద ఉన్న ఈదుల వాగు ఉదృతంగా […]

డల్లాస్ లో భారత సంతతి వ్యక్తి తల నరికి హత్య

Indian-origin man beheaded

న్యూయార్క్: అమెరికాలోని డల్లాస్‌లో భారత సంతతి వ్యక్తి హత్యకు గురయ్యాడు. చంద్రమౌళి నాగమల్లయ్య అనే భారత సంతతి వ్యక్తి డల్లాస్ నగరంలో మోటల్ నిర్వహిస్తున్నాడు. మోటల్‌లో పని చేసే జోర్డాన్ కాబోస్ మార్టినెజ్ అనే ఉద్యోగి కత్తితో చంద్రమౌళి తల నరికి చంపాడు. చంద్రమౌళిని చంపుతున్నప్పుడు భార్య, పిల్లలు అక్కడే ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జోర్డాన్ కాబోస్ మార్టినెజ్ ను అరెస్టు చేసి […]