పట్టపగలే భారీ దారి దోపిడీ
కారులో డబ్బులు తీసుకెళ్తున్న వ్యక్తులను మరో కారులో అడ్డగించి, భారీ దోపిడీకి పాల్పడిన సంఘటన రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సంచలనం సృష్టించింది. పోలీసులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి రాకేష్ అగర్వాల్ తన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన రూ.40 లక్షలను వికారాబాద్‌లోని తమ కస్టమర్ నుంచి తీసుకుని రావాల్సిందిగా తన వద్ద పని చేసే ఇద్దరు వ్యక్తులను అక్కడికి పంపాడు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో వికారాబాద్ […]