నా మెదడు విలువ రూ.200 కోట్లు.. ఆ పని రైతుల కోసమే చేశా: గడ్కరీ
ముంబయి: రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకే ఆలోచిస్తామని, తమ జేబులు నింపుకోవడానికి కాదని కేంద్ర రహదారుల, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ సురక్షితం కాదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండడంతో నితిన్ గడ్కరీ స్పందించారు. శనివారం నాగ్‌పూర్‌లోని అగ్రికోస్ వెల్పేర్ సొసైటి నిర్వహించిన కార్యక్రమంలో నితిన్ ప్రసంగించారు. తాను డబ్బు కోసం ఇలా చేస్తున్నానని ప్రజలు అనుకుంటున్నారా?, నిజాయతీతో ఎలా సంపాదించాలో తనకు తెలుసునని వివరించారు. […]