Latest News
హెచ్‌సిఎ అక్రమాలపై విచారణ కమిటీ వేయండి
మన తెలంగాణ/హైదరాబాద్: కొంతకాలం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ)లో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలను బయటకు తెచ్చేందుకు ఉన్నత స్థాయి విచారణ కమిటీ వే యాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ)కి తెలంగాణ జిల్లా ల క్రికెట్ సంఘం అధ్యక్షు డు, మాజీ శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. ఈ మేరకు అల్లీపురం బిసిసిఐ కార్యదర్శి దేవాజిత్ సైకియాకు మంగళవారం లేఖను ఈమెయిల్ చేరారు. ఈ లేఖలో హెచ్‌సిఎలో చోటు చేసుకున్న పరిణామాలను […]
అభ్యంతరాల్లేని భూములను రెగ్యులరైజ్ చేయండి – సీఎం చంద్రబాబు ఆదేశాలు
మసూద్ కుటుంబం ముక్కలైపోయింది: జైషే అగ్ర కమాండర్
ఇస్లామాబాద్: గత మే నెలలో భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఉగ్రవాద నాయకుడు మసూద్ అజర్ కుటుంబంలో పిల్లాపాపలతో సహా కుటుంబ సభ్యులంతా మరణించారని తొలిసారిగా జైషే మొహమ్మద్ అంగీకరించింది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో జైషే అగ్రకమాండర్ ఇలియాస్ కశ్మీరీ మాట్లాడుతూ.. ఇటీవల మనకు తీవ్ర నష్టం వాటిల్లందని వ్యాఖ్యానించారు. మే 7న బహవల్ పూర్ లోని జైషే ప్రధాన కార్యాలయం, జామియా మసీదు సుభాన్ అల్లాపై జరిగిన దాడిలో మసూద్ అజర్ కుటుంబంలోని […]
రెండేళ్ల హింసపై ఇప్పుడా కన్నీళ్లు?
మణిపూర్‌లో రెండేళ్ల క్రితం 2023 మే 23న మెయితీలు, కుకీ జో తెగల మధ్య రగిలిన హింసాకాండలో 250 మంది ప్రాణాలు కోల్పోయారు. 60,000 మంది కట్టుబట్టలతో ఇళ్లు విడిచిపెట్టి పోయారు. బలవంతంగా తాత్కాలిక శిబిరాలకు తరలి తలదాచుకోవలసి వచ్చింది. ఇంత దారుణంగా రావణ కాష్ఠంలా ఇప్పటికీ రగులుతున్న మణిపూర్‌లో తొలిసారి ప్రధాని మోడీ శనివారం (13.9.2025) నాడు పర్యటించారు. అక్కడ ఉన్న ఐదు గంటల సమయంలో కుకీ జో తెగ నాడీ కేంద్రమైన రాష్ట్ర రాజధాని […]
సర్ఫరాజ్‌కు మెట్రో బాధ్యతలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్ అధికారులతో పాటు నాన్ కేడర్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. చాలా ఏళ్లుగా మెట్రోరైల్ ఎండిగా పనిచేస్తున్న ఎన్వీఎస్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుడిగా (పట్టణ, రవాణా) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో హైదరాబాద్ మెట్రోరైల్ ఎండిగా సర్ఫరాజ్ అహ్మద్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగించింది. […]
విలీనమా.. విద్రోహమా.. విమోచనమా?
సెప్టెంబర్ -17 తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన రోజు. కానీ ఆ రోజును ఎలా జరుపుకోవాలని, ఏమని పిలవాలని గడచిన 77 సంవత్సరాలుగా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాము. కొందరు విలీనం అంటారు, మరికొందరు విమోచనమంటారు, ఇంకొందరు విద్రోహమంటారు. గత ప్రభుత్వం సమైక్యత అంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రజాపాలన అంటుంది. చరిత్రలో ఇంత సంక్లిష్టమైన, ఒక నిర్ణయానికి రాని రోజు ఉండక పోవచ్చు. చరిత్రను చారిత్రక నేపథ్యంతో అర్థం చేసుకుంటే ఈ రకమైన సంక్లిష్టతకు అవకాశం ఉండదు. […]
Modi Trump talks : మోదీకి ట్రంప్ బర్త్‌డే విషెస్- అద్బుతంగా పనిచేస్తున్నారని ప్రశంసలు!
ప్రేక్షక పాత్రకు భారత్ పరిమితం
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ 2014లో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఎవ్వరూ ఊహించని విధంగా సార్క్ దేశాధినేతలు ఆహ్వానించి, ‘పొరుగు దేశాలతో మైత్రి’కి తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తర్వాత దాదాపు అన్ని దేశాలలో నేడు భారత్ సానుకూల ప్రభుత్వాలులేని పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ దేశాలలో చైనా ప్రాబల్యం గణనీయంగా పెరుగుతుంది. మరోవంక, ఆయా దేశాలలో కీలుబొమ్మ ప్రభుత్వాల ఏర్పాటులో అమెరికా క్రియాశీల పాత్ర పోషిస్తున్నది. తాజాగా […]
ఎవరి దారి వారిదే
మనతెలంగాణ/హైదరాబాద్:హైదరాబాద్ స్టేట్ నిజాం పాలన నుంచి 17సెప్టెంబర్, 1948 రోజున భారత యూనియన్‌లో చేరడంతో ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చింది. ఈ చారిత్రక ఘట్టాన్ని ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో పేరుతో ప్రతీఏటా వేడుకలను నిర్వహిస్తూ వస్తోంది.తెలంగాణ ప్రాంతం సమైక్య ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రంలో కొనసాగుతోన్నప్పటి నుంచే ఈ వేడుకలు జరుగుతూ వస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో ఈ వేడుకులకు అంతటి ప్రాధాన్యత లేకపోయినప్పటికీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. అప్పటివరకు తెలంగా […]