ఆపరేషన్ సిందూర్ లో మేమూ చావు దెబ్బ తిన్నాం
ఆపరేషన్ సిందూర్ లో జైష్ -ఏ- మొహమ్మద్ కు చెందిన మసూద్ అజర్ కుటుంబం చిన్నాభిన్నమైందని అగ్రకమాండర్ ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత అదే ఆపరేషన్ లో మురిడ్కేలోని మర్కజ్ తైబా లోని టెర్రరిస్ట్ సంస్థ ప్రధాన కార్యాలయం సర్వనాశనం అయిందని లష్కరే తోయిబా (ఎల్‌ఐటి) కార్యకర్త అంగీకరించారు. మే7న భారత వైమానిక దళాలు పాకిస్తాన్ లోనూ, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పిఓకే) లో నేలమట్టం చేసిన తొమ్మిది టెర్రరిస్ట్ స్థావరాలలో లష్కరే మురిడ్కే శిబిరం కూడా […]