15 ఉద్యోగ సంఘాలకు మళ్లీ గుర్తింపు

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చొరవతో సుధీర్ఘకాలం తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యోగసంఘాలు తిరిగి ప్రభుత్వ గుర్తింపునకు నోచుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఉద్యోగసంఘాలకు గుర్తింపు ఇవ్వాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు(జివో నెం.185) జారీచేసింది. మంగళవారం ఉద్యోగ సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో సమావేశమయ్యారు. వెంటనే సాధారణ పరిపాలన శాఖ(జిఎడి) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి […]