గ్రూప్-1 అవకతవకలపై బిజెపి కిమ్మనడంలేదు: కెటిఆర్

KTR comments Revanth Reddy

హైదరాబాద్: ఏకంగా గ్రూప్-1 పరీక్షలనే రద్దు చేయాలని హైకోర్టు చెప్పిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి ఎన్ని స్కాములు చేసినా బిజెపి పట్టించుకోవట్లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్-1 అవకతవకలపై బిజెపి కిమ్మనడంలేదని, పోస్టుల అమ్మకం ఆరోపణలపై బిజెపి మౌనానికి కారణమేంటి? అని కెటిఆర్ ప్రశ్నించారు. తమ హయాంలో ప్రతిదానికీ సిబిఐ విచారణ కావాలని హడావిడి చేశారని, గ్రూప్-1 స్కాంపై బిజెపి నేతలు సిబిఐ విచారణ ఎందుకు […]

గ్రూప్ 1 పోస్టుల అమ్మకాల ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలి:కెటిఆర్

గ్రూప్ 1 పోస్టుల కోసం డబ్బులు చేతులు మారాయని పలువురు విద్యార్థులు చేస్తున్న ఆరోపణలపైన ప్రభుత్వం స్పందించాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయం గ్రూప్ 1 అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు నేరుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశంలో తగిన విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. గ్రూప్ 1 పోస్టుల కోసం భారీగా డబ్బులను డిమాండ్ చేసినట్లు పలువురు విద్యార్థులు మీడియాలో చేస్తున్న […]

కెటిఆర్‌కు అరుదైన గ్లోబల్ గౌరవం

KTR

భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కె.టి. రామారావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ‘గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025’కు ఆయన ఎంపికయ్యారు. ఈ నెల చివరిలో అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు ప్రదానోత్సవం సెప్టెంబర్ 24న న్యూయార్క్‌లో జరగనున్న 9వ ఎన్‌వైసి గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్‌లో జరగనుంది. ఈ విషయాన్ని గ్రీన్ మెంటార్స్ సంస్థ అధికారికంగా […]

యువత నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసింది: కెటిఆర్

KTR comments congress

హైదరాబాద్: గ్రూప్-1 పోస్టుల కోసం సిఎంవొలు డబ్బులు డిమాండ్ చేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. గ్రూప్-1 పోస్టులు అమ్ముకున్నట్లు మంత్రులు, సిఎంవొపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..యువత నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసిందని, డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలపై కాంగ్రెస్ స్పందించాలని సూచించారు. ఆరోపణల దృష్ట్యా తగిన విచారణ జరగాల్సిన అవసరం ఉందని, హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమాలకు తావు లేకుండా మళ్లీ పరీక్ష […]

ఇండ్లు కూల్చడమేనా?

మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే, తమ ఇండ్లను కూలగొట్టేందుకు ప్రభుత్వానికి లైసెన్స్ ఇ చ్చినట్టేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ హెచ్చరించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టడమేనా ప్రశ్నించారు. హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరించి కాంగ్రెస్ నేతలు కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఉప ఎన్నికలలో కా రు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి అ హంకారాన్ని బొందపెట్టాలని జూబ్ల్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.తెలంగాణ భవన్‌లో […]

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు ఓటేస్తే మీ ఇంటిని కూలగొట్టే లైసెన్స్ ఇచ్చినట్టే: కెటిఆర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే, తమ ఇండ్లను కూలగొట్టేందుకు ప్రభుత్వానికి లైసెన్స్ ఇచ్చినట్టేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ హెచ్చరించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టడమేనా ప్రశ్నించారు. హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరించి కాంగ్రెస్ నేతలు కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఉప ఎన్నికలలో కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి అహంకారాన్ని బొందపెట్టాలని జూబ్ల్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల […]

ఉపఎన్నికలో గెలుపే గోపినాథ్‌కు సరైన నివాళి: కెటిఆర్

KTR

హైదరాబాద్: అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరుగుతుందని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ (KTR) అన్నారు. మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఎన్నికలో విజయం సాధించాలని బిఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ పార్టీ కార్యకర్తలతో కెటిఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీ మెజారిటీతో బిఆర్ఎస్ గెలుపే గోపీనాథ్‌కు సరైన […]

కెటిఆర్‌కు నీటిపారుదలపై అవగాహన లేదు:మంత్రి వివేక్ వెంకటస్వామి

మల్లన్నసాగర్‌కు ఎల్లంపల్లి నుంచే నీళ్లోస్తాయని, కెటిఆర్‌కు నీటి పారుదలపై అవగాహన లేదని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ఒక ఫెయిల్డ్ ప్రాజెక్టు అని తాను గతం లోనే చెప్పినట్లు గుర్తు చేశారు. మల్లన్నసాగర్ ఒక పెద్ద కుంభకోణమని అన్నారు. కెసిఆర్ కోసమే కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ నిర్మించా రని ఆరోపించారు. సిఎం రేవంత్‌రెడ్డి భూమి పూజ చేసింది ఒరిజినల్ ప్రాజెక్టు అని చెప్పారు. కెటిఆర్ … Read more

కెటిఆర్‌పై నమోదైన కేసులు కొట్టేసిన హైకోర్టు

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై నమోదైన కేసులను మంగళవారం హైకోర్టు కొట్టేసింది. గతేడాది పదోతరగతి ప్రశ్నాపత్రాల లీక్‌పై కెటిఆర్ ట్వీట్ చేశారు. ఈ విషయంపై ఎటువంటి ఆధారాలు లేకుండా కెటిఆర్ తమ పేరు ఎలా చెబుతారని కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడంతో నల్గొండలో వేరువేరు పోలీస్ స్టేషన్‌లలో కెటిఆర్‌పై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తనపై నమోదయిన కేసులను కొట్టివేయాలంటూ కెటిఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ … Read more