కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్‌లో పురుగుల భోజనం

ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతిగృహంలో వడ్డించిన భోజనంలో బుధవారం పురుగులు దర్శనమిచ్చాయి. విద్యార్థినులు భోజనం చేస్తుండగా అందులో పురుగులు కనిపించడంతో ఒక్కసారిగా విస్తుపోయారు. ఈ విషయం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సబ్ కలెక్టర్ యువరాజు పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. రిజిస్టర్, వంటగదిని పరిశీలించి గోదామును తనిఖీ చేశారు. సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని […]