‘కల్కి’ నుంచి దీపికా ఔట్.. కారణాలు ఏంటో మరీ..
నటి దీపికా పదుకొనేను మరో ప్రతిష్టాత్మక సినిమా నుంచి తప్పించారు. ఇప్పటికే ఈ బ్యూటీ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ‘స్పిరిట్’ మూవీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. వర్కింగ్ అవర్స్, రెమ్యూనరేషన్ తదితర అంశాల్లో దీపికా పెట్టిన కండీషన్ల కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే తాజాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘కల్కి 2898 ఎడి’ (Kalki 2898 AD) చిత్రం సీక్వెల్ నుంచి కూడా దీపికాను తొలగించారు. […]