జూరాల 45 గేట్లు ఎత్తివేత
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఉగ్రరూపం దాల్చుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో అదే స్థాయిలో వరద నీటిని దిగువన ఉన్న జూరాలకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో జూరాల క్రస్ట్ గేట్లను పెంచుతూ వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పాటు ప్రాజెక్టు దిగువన ఉన్న […]