అరబ్బుల అసమర్థ నిస్సహాయత
ఖతార్ రాజధాని దోహాపై ఈ నెల 9న ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి మొత్తం అరబ్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అరబ్బులు కాని ఇతర ముస్లిం దేశాలను, ఇతరత్రా అన్ని దేశాలను కూడా. ఎందుకో తెలిసిందే. ఖతార్ అమెరికాకు ఒక నమ్మిన బంటువలే వ్యవహరిస్తున్నది. గల్ఫ్ ప్రాంతం లో అన్నింటికన్న పెద్ద అమెరికన్ సైనిక స్థావరం ఖతార్‌లోనే ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఖతార్‌ను సందర్శించగా ఆయనకు ఆ దేశాధిపతి చాలా ఖరీదైన బోయింగ్ విమానాన్ని […]