ఇందిరమ్మ ఇళ్లకు రూ.1435 కోట్ల చెల్లింపులు
ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.1,435 కోట్లను లబ్ధిదారులకు అందచేసినట్లు గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి.గౌతం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.15 లక్షల ఇళ్ల పనులు ప్రారంభం కాగా, 1.29 లక్షల ఇళ్ల పనులు పురోగతిలో ఉన్నాయని, వాటిలో సుమారు 20 వేల ఇళ్ల గోడలు, 8633 ఇళ్ల రూఫ్ పూర్తి అయ్యాయని ఎండి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన ఇళ్లకు గృహ ప్రవేశాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇళ్ల […]