వీసాలపై వెయ్యికళ్ల నిఘా

అమెరికాలోని భారతీయ విద్యార్థుల కదలికలపై నిఘా పెంచిన సంగతి తెలిసిందే. భారత దేశంనుంచి విద్యార్థులు నిజంగా చదువులకోసం వచ్చారా లేదా చట్ట వ్యతిరేకంగా ఏవైనా ఉద్యోగాలు చేస్తున్నారా? సరైన అధికారిక పత్రాలతో వచ్చారా? వాళ్ల బ్యాంకు లావాదేవీలు ఎలా ఉన్నాయి? తదితర అంశాలపై తీవ్రంగా నిఘా కొనసాగుతోంది. అదేవిధంగా ఇప్పుడు తాజాగా హెచ్1బి, ఎఫ్1 వీసాదారుల అనధికారిక సంపాదనపైనా నిఘా పెడుతున్నారు. ఈ మేరకు పన్ను చెల్లింపుదారుల సమాచారాన్ని ఇమిగ్రేషన్ అధికారులకు ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) […]