ఇప్పటికీ స్వేచ్ఛాయుత వ్యూహమే!

భారత విదేశాంగ విధానం గురించి ఎస్‌సిఒ తియాన్‌జిన్ సమావేశాల తర్వాత పలు విధాలైన వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. వాటిలో అన్నింటి కన్న ఎక్కువగా కనిపిస్తున్న అభిప్రాయం, భారతదేశం ఇక అమెరికా కూటమికి పూర్తిగా దూరమైపోయి చైనా, రష్యా కూటమిలో చేరిపోవటం ఇంకా జరగకున్నా ఆ దిశలో ప్రయాణం మొదలుపెట్టిందినేది.. ఈ అభిప్రాయానికి పరాకాష్ట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి వినిపించింది. తామిక ఇండియాను రష్యాను కూడా చైనాకు కోల్పోయినట్లు తోస్తున్నదని దీనమైన మొహంతో అన్నారాయన. ఆ ముగ్గురి మైత్రి […]