సమితి వేదికపైనా ట్రంప్ అదే పాట
తనను తాను పొగుడుకుంటే తన్నుకున్నట్లే ఉంటుందన్నది సామెత. అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఈ సామెత నూటికి నూరుపాళ్లూ వర్తిస్తుంది. తాను రెండోసారి పదవి చేపట్టాక ఎన్నో యుద్ధాలను ఆపానని, కాబట్టి తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని వితండవాదం చేస్తున్న ఈ పెద్దమనిషి, చివరకు ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలోనూ అదే పాట పాడారు. గత ఏడు నెలల్లో ఏడు యుద్ధాలను ఆపానంటూ చిట్టా విప్పిన ట్రంప్ మహాశయుడు పాకిస్తాన్-భారత్ ఘర్షణను కూడా మరొకసారి తన ఖాతాలోకే వేసుకున్నారు. […]