హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు..నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉంది: కిషన్‌రెడ్డి
హైదరాబాద్ అంటే కేవలం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ మాత్రమే కాదు, నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మరింత పెంచేలా నగరాభివృద్ధి జరగాలని ఆయన ఆకాంక్షించారు. కేంద్రం నుంచి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ […]