మధ్యప్రదేశ్ సిఎంకు తృటిలో తప్పిన ప్రమాదం

భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్‌కు శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కేందుకు సిద్ధమవుతున్న హాట్ ఎయిర్ బెలూన్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంటలను అదుపు చేయడంతో సీఎంకు ప్రమాదం తప్పింది. మంద్‌సౌర్ లోని గాంధీ నగర్ ఫారెస్ట్ రిట్రీట్ వద్ద ఈ సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి ఎయిర్ బెలూన్ ఎక్కడానికి సిద్ధమవుతుండగా బెలూన్ దిగువ భాగంలో మంటలు అంటుకున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. […]