నాలాలో మిస్సింగ్.. ఇంకా దొరకని ఆచూకీ.. కుటుంబసభ్యుల ఆగ్రహం

Hyderabad

హైదరాబాద్: కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నగరాన్ని (Hyderabad) అతలాకుతలం చేశాయి. మూడు రోజుల క్రితం భారీ వర్షం కురియడంతో పలు ప్రాంతాల్లో రోడ్లన్ని జలమయమయ్యయి. ఈ క్రమంలో వాహనదారుడు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. అయితే అఫ్జల్‌సాగర్, వినోబానగర్‌లో ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా నాలాలు ఉప్పొంగాయి. ఈ క్రమంలో నాలాల్లో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు. గల్లంతైన అర్జున్, రాము, దినేష్‌లుగా గుర్తించారు. అయిుతే గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. డిఆర్ఎఫ్, […]

భాగ్యనగరంలో భారీ వర్షం… ముగ్గురు గల్లంతు

Hyderabad Heavy rains

హైదరాబాద్: భాగ్యనగరంలో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయంగా మారాయి. గంట వ్యవధిలోనే దాదాపు 12 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాలలో లోతట్టు ప్రాం తాలు, రహదారులు జలమయమయ్యాయి. వీధుల్లో వరదలు పోటెత్తాయి. ముగ్గురు యువకులు వరదల్లో గల్లంతయ్యారు.  ఆసిఫ్ నగర్ ప్రాంతం హబీబ్ నగర్‌లో మామ, అల్లుడ్లు వరదలో కొట్టుకుపోయారు.   ముషీరాబాద్ ప్రాంతం వినోద నగర్‌లో పిట్టగొడపై సన్నీ అనే యువకుడు కూర్చొని స్నేహితులతో మాట్లాడతున్నాడు. గోడ కూలిపోవడంతో సన్నీ నాలాలో […]

రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని ఈ ప్రభావంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, […]

రాష్ట్రంలో రెండు రోజుల పాటు అతిభారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంకు తోడు అల్పపీడన ప్రబావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో శనివారం రాష్ట్రంలో నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్క భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, […]