జిఎస్‌టి కొత్త శ్లాబులు.. కమలానికి కలిసొచ్చేనా!

జిఎస్‌టి శ్లాబుల మార్పు అంశాన్ని బలమైన రాజకీయ అస్త్రంగా మల్చుకొనేందుకు బిజెపి సిద్ధమవుతోంది. ఇప్పటికే అమలులోనున్న జిఎస్‌టి విధానంతో ప్రధాని నరేంద్ర మోడీ కేవలం కార్పొరేట్ శక్తులకే మేలు చేశారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తూ వచ్చారు. వాటిని ఎదుర్కొనేందుకు తాజాగా జిఎస్‌టి శ్లాబుల మార్పుతో తాము పేద, సామాన్య, మధ్య తరగతి పక్షమని చెప్పుకొనే ప్రయత్నం చేస్తోంది. చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనంతగా మిడిల్ క్లాస్‌కు ప్రధాని మేలు చేశారని బిజెపి అంటోంది. మోడీ వల్లనే […]