గ్రూపు 1 ఉద్యోగాలు రాకూడదని కెటిఆర్ కుట్ర: ఎంపి చామల
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రూపు 1 ఉద్యోగ నియామకాలు జరగరాదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. గ్రూపు 1 పరీక్షలలో 563 అభ్యర్థుల వద్ద మూడు కోట్ల రూపాయల చొప్పున తీసుకుని ప్రభుత్వం వాళ్ళను ఎంపిక చేసిందని కెటిఆర్ చేసిన వ్యాఖ్యలను ఎంపి చామల ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగ నియామకాలు జరగలేదని ఆయన విమర్శించారు. […]