నూతన మున్సిపాలిటీలు, పంచాయతీల ఏర్పాటు బిల్లుకు గవర్నర్ ఆమోదం
తెలంగాణ పంచాయతీ రాజ్ (రెండో సవరణ) చట్టం, 2025 బిల్లును గవర్నర్ ఆమోదించి గురువారం సంతకం చేశారు. ఈ బిల్లులో సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ, నల్గొండ జిల్లాలోని హాలియా మున్సిపాలిటి పరిధిలోని ఇబ్రహీంపేట ను నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఈ బిల్లును శాసనసభ, మండలి ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపడంతో ఇప్పుడు ఆమోదం జరిగింది. ఇందుకు సంబంధించి త్వరలో గెజిట్ నోటిఫికేషన్ విడుదలవుతుందని పంచాయతీరాజ్ శాఖ […]