నరమేధమే ఇజ్రాయెల్‌కు ఆమోదమా!
గాజాలో ఇజ్రాయెల్ దారుణ మారణహోమానికి అగ్రనాయకులే ఆజ్యం పోస్తున్నారని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి కమిషన్ మంగళవారం వెలువరించిన 72 పేజీల నివేదికలో అనేక వాస్తవాలు బయటపడ్డాయి. పాలస్తీనా ప్రజలకు నిలువనీడ లేకుండా చేయడమేకాక సామూహిక హత్యాకాండకు పాల్పడుతోందని నివేదిక స్పష్టం చేసింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 1948లో ఐక్యరాజ్యసమితి జర్మనీలో హిట్లర్ ఊచకోతలను ప్రామాణికంగా తీసుకొని ‘సామూహిక హత్యాకాండ’ అంటే ఏమిటో నిర్వచించింది. దీనినే జీనోసైడ్ కన్వెన్షన్ (జాతి నిర్మూలన నివారణ సదస్సు)అని పిలుస్తారు. […]