కబ్జా చేసిన వారిలో రౌడీషీటర్లు ఉన్నారు: రంగనాథ్
మేడ్చల్ మల్కాజ్ గిరి: గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. గాజులరామారంలో నకిలీ పట్టాలతో భూములు కబ్జా చేశారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా చేసి భూములను అమ్మారని, ఆ భూముల విలువ రూ.15వేల కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. కబ్జా చేసిన వారిలో రౌడీషీటర్లు ఉన్నారని, కబ్జా చేసిన వాటిలో 30శాతం మాత్రమే కూల్చివేశామని, కూల్చినవి కూడా నిర్మాణంలో ఉన్నవేనని తెలియజేశారు. సోషల్‌మీడియాలో దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ప్రభుత్వ భూమిలోని 260 […]