చెరువుల్లోకి చేప పిల్లలు రెడీ

రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం కింద చెరువుల్లో చేపపిల్లల టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 28 జిల్లాలకు శుక్రవారం టెండర్లు ఖరారు అయ్యాయి. నాలుగు జిల్లాల్లో టెండర్లు రాలేదు. హైదరాబాద్ జిల్లాలో చెరువులు లేకపోవడంతో టెండర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. టెండర్లు దాఖలు కాని జిల్లాలు కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నిర్మల్ ఉన్నాయి. ఈ జిల్లాల విషయంలో అధికారులు తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. శుక్రవారం ఖరారైన 28 జిల్లాల టెండర్ల ప్రక్రియ పూర్తి అయినందున ఎంపికైన […]