దెబ్బకు దిగొచ్చిన ట్రంప్.. విదేశీ ఉద్యోగులను నియమించుకోండంటూ పోస్ట్

వాషింగ్టన్ : అమెరికా పరిశ్రమలలో విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. యూఎస్‌లో పెట్టుబడుల గురించి తాము ఆలోచిస్తామంటూ దక్షిణ కొరియా నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో అధ్యక్షుడు దెబ్బకు దిగొచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి అక్రమ వలసల విషయంలో కఠినవైఖరి అవలంబిస్తున్నారు. వారిని గుర్తించి వెనక్కి పంపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల జార్జియాలో 475 మంది అక్రమ వలసదార్లను నిర్బంధించినట్టు హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. […]