బాసరలో ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ
ఎగువన మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లా, బాసర వద్ద గోదావరి నదికి వరద ఉద్ధృతి క్రమ క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలోని నాందేడ్, పర్బని జిల్లాల్లో భారీ వర్షాలు ఏకధాటిగా కురుస్తుండడంతో ఇక్కడి గోదావరి నదీ తీరం వద్ద పుణ్యస్నానాలకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. నదిలోకి వెళ్లకుండా ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. గోదావరి బ్యాక్ వాటర్‌తో ఆలయం నుండి గోదావరి నదికి వెళ్లే మార్గంలో వరద నీరు వచ్చి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. […]